'మండల మహాసభలను జయప్రదం చేయండి'

SRPT: భవన నిర్మాణ కార్మిక సంఘం మునగాల మండల 5వ మహాసభలు ఈనెల 18న మునగాల మండలంలో సోమవారం జరుగనున్నాయి. మునగాల మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన సీఐటీయూ ముఖ్య నాయకులు సమావేశంలో సీఐటీయూ సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం పాల్గొని మాట్లాడారు. మండల మహాసభలను జయప్రదం చేయాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు.