CMRF చెక్కుల పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షుడు
E.G: కూటమి ప్రభుత్వంలో CMRF చెక్కులు నిరు పేదలకు వరంగా మారిందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ పేర్కొన్నారు. బుధవారం ఆయన జగ్గంపేట టీడీపీ పార్టీ కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు రూ.17,78 లక్షల విలువైన చెక్కులను అందించారు. అందులో గోకవరం మండలానికి 2 చెక్కులు, జగ్గంపేట మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను అందించారు.