ఎస్పీ ఆదేశాలతో కార్డన్ అండ్ సెర్చ్

ఎస్పీ ఆదేశాలతో కార్డన్ అండ్ సెర్చ్

VZM: జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం నాటు తుపాకీల ఏరివేత లక్ష్యంగా కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధి జోడుమేరక గ్రామంలో బుధవారం సాయంత్రం కార్డన్ అండ్ సెర్చ్ చేపట్టారు. గ్రామంలో ఉన్న పలు ఇళ్లను నిశితంగా తనిఖీలు చేశారు. నాటు తుపాకీలు ఉంటే స్వచ్చందంగా అప్పగించాలని కోరారు. ఒకవేళ గ్రామాల్లో ఎవరి వద్దనైనా ఉంటే పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.