భేరీ వాయిస్తూ సందడి చేసిన ఎమ్మెల్యే సామేలు

భేరీ వాయిస్తూ సందడి చేసిన ఎమ్మెల్యే సామేలు

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం కోడూరులో యాదవుల ఆరాధ్య దైవమైన సౌడమ్మ జాతరకు సోమవారం ఎమ్మెల్యే సామేలు హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సౌడమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం భేరీ వాయిస్తూ సందడి చేస్తూ జాతరకు విచ్చేసిన భక్తులను ఎమ్మెల్యే ఉత్తేజపరిచారు. వారి వెంట చెవిటి వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.