ALERT: 9 రోజులు జాగ్రత్త
TG: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రంగా ఉండనుందని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 9°C లోపు పడిపోవచ్చని తెలిపింది. అలాగే ఉదయం ఉష్ణోగ్రతలు 11°C నుంచి 14°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.