సామెత-దాని అర్థం
సామెత: 'దున్నపోతు మీద వాన పడ్డట్టు'
అర్థం: ఇతర పశువుల్లా కాకుండా దున్నపోతు దానిపై ఎంత వర్షం పడినా చలించదు, అలాగే నిలబడి ఉంటుంది. ఈ మాదిరిగానే అన్నింటా నిర్లక్ష్యంగా వ్యవహరించేవారికి ఎన్ని సలహాలు ఇచ్చినా నిష్ప్రయోజనం. ఎంత శ్రమించినా ఫలితం దక్కదని చెప్పేందుకు ఈ సామెత వాడుతుంటారు.