ఎంత పొగిడినా ప్రత్యేక నిధులేమి రాలేదు: రామకృష్ణ

AP: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై సీపీఐ రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని సీఎం, లోకేష్‌లు ఎంత పొగిడినా రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులేమి ఇవ్వలేదన్నారు. ప్రధాని ఏపీ ప్రజల ఆశలను నీరు గార్చారన్నారు. రాజధాని కోసం లక్షల కోట్లు అప్పు తెచ్చి ప్రజలపై భారం మోపుతున్నారన్నారు. వెనుకబడ్డ ప్రాంతాలపై చంద్రబాబుకు శ్రద్ధ లేదన్నారు.