రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం
SKLM: వజ్రపుకొత్తూరు (M) గోవింద పురంలో పాఠశాలల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాలబాలికల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. వీటిని టీపీసీ ఛైర్మన్ వి.బాబూరావు, అగ్నికుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ ఈశ్వరరావు ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో 13 జిల్లాల నుంచి 572 మంది క్రీడాకారులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.