లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

NRPT: మక్తల్ పట్టణ శివారులో శుక్రవారం తెల్లవారుజామున ఆగి వున్న లారీని ప్రైవేట్ ట్రావెల్‌కు చెందిన బస్సు వెనక నుంచి ఢీకొట్టిన ఘటన జరిగింది. స్థానికుల కథనం మేరకు బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు వుండగా వారిలో ఇద్దరికీ స్వల్ప గాయాలు అయ్యాయని చెప్పారు. బస్సు కర్ణాటకలోని రాయచూరు నుంచి హైద్రాబాద్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.