వరల్డ్ కప్.. ఆ పీడకలకు రెండేళ్లు
స్వదేశంలో భారత్ ODI వరల్డ్ కప్ ఫైనల్ ఓడి నేటికి రెండేళ్లు. 2023 టోర్నీ ఆద్యంతం రాణించిన రోహిత్ సేన ఇదే రోజున ఆస్ట్రేలియా చేతిలో భంగపడింది. ట్రావిస్ హెడ్(137) సెంచరీతో 140 కోట్ల భారతీయుల కలను చెదరగొట్టాడు. దీంతో కోహ్లీ(765), రోహిత్(597), షమీ(24), బుమ్రా(20) పోరాటం వృథా అయ్యింది. ఆ ఓటమి క్రికెట్ అభిమానులను పీడకలలా ఇప్పటికీ నొప్పిస్తూనే ఉంది.