5,500 విమానాలకుపైగా రద్దు: కేంద్రమంత్రి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగతున్న విషయం తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులతో దాడి చేసినప్పటి నుంచి ఆయా దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు తమ విమాన సర్వీసులను రద్దు చేశాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ వైపు 5,500లకు పైగా విమానాలు రద్దయినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో వెల్లడించారు.