VIDEO: 'విద్య ప్రమాణాల మెరుగు కోసమే తనిఖీలు'
వనపర్తిలోని జూనియర్ కళాశాలల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఈనెల 15 వరకు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. బోర్డు సూచనల మేరకు విద్యార్థుల హాజరు, సిలబస్, సిబ్బంది పనితీరు, పలు రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సకాలంలో సిలబస్ పూర్తి చేసి వెనుకబడిన విద్యార్థులపై శ్రద్ధ చూపే విధంగా అధ్యాపకులకు సూచిస్తున్నట్లు తెలిపారు.