విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష

విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ రాష్ట్రానికి గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకూ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై అధికారులతో చర్చించారు.