ఎన్నికల నిర్వహణపై చర్చించిన కలెక్టర్
BDK: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు సాధారణ పరిశీలకుడిగా సర్వేశ్వర్ రెడ్డి, వ్యయ పరిశీలకురాలిగా లావణ్య నియమితులయ్యారు. గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్న వీరిని జిల్లా కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ ఐడీవోసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాబోయే ఎన్నికల నిర్వహణ, పోలింగ్ ఏర్పాట్లు, వ్యయ పర్యవేక్షణ అంశాలపై చర్చించారు.