జిల్లా కలెక్టర్‌ను కలిసిన ఎమ్మెల్యే

TPT: సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం కలెక్టర్ వెంకటేశ్వర్లు, జేసీ శుభం బన్సల్‌ను జిల్లా కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పేదలకు ఇంటి పట్టాలు స్మశాన సమస్యలు, ఇతర భూ సమస్యలు పరిష్కారం కోరుతూ జిల్లా కలెక్టర్, జేసీలకు వినతి పత్రాన్ని అందించగా, సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.