నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

VSP: భోగాపురం మండలం దలిపేట పంచాయతీకి చెందిన ఆటోడ్రైవర్ దుక్క గోవింద్ ఆనందపురం మీదుగా మధురవాడకు వెళ్తున్నాడు. భీమిలి క్రాస్ రోడ్డు సమీపంలో కామత్ హోటల్ ఎదురుగా ఉన్న రోడ్డుపై ల్యాప్‌టాప్ దొరికింది. వెంటనే ఆనందపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సీఐ వాసునాయుడుకు ల్యాప్‌టాప్‌ను అందజేశారు. ఆటో డ్రైవర్ నిజాయితీని పలువురు అభినందిస్తున్నారు.