అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా ఉండాలి: కలెక్టర్
కడప: అర్జీదారుల సమస్యలపై GRA అధికారులు బాధ్యతాయుతంగా స్పందించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శనివారం PGRSపై సమీక్షలో మాట్లాడుతూ.. ఫిర్యాదు అందిన 24 గంటల్లోగా ఎండార్స్‌మెంట్ చేయాలని, పొంతనలేని సమాధానాలు ఇవ్వరాదని, వచ్చే నెల నాటికి పెండెన్సీ జీరో స్థాయికి రావాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.