ఈ నెల 18 నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 18 నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో వాణి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు.