VIDEO: వనదుర్గమ్మ మంగళహారతి పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల క్షేత్రంలో వనదుర్గ మాతకు మంగళవారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. వైశాఖమాసం, శుక్లపక్షం, భౌమవాసరే, నవమి తిథిని పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం పట్టు వస్త్రాలు సమర్పించి సుగంధ పుష్పాలతో అలంకరించి మంగళహారతి చేశారు.