VIDEO: అకాల వర్షం.. వరి పంటకు తీవ్ర నష్టం.!
KDP: ఖాజీపేట మండలం ప్రాంతంలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షంతోపాటు గాలుల ఉద్ధృతికి వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరగడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు తెలిపారు. పుల్లూర్ సమీపంలో వరి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. చెరువు ఆయకట్టుపై ఆధారపడి వరి పంటను సాగుచేస్తే ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టం జరిగిందని వాపోయారు.