అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అన్నమయ్య: జిల్లా రామాపురం మండలం రాచపల్లి పంచాయతీ వడ్డేపల్లెకు చెందిన 35 ఏళ్ల రైతు కుంచపు నాగేంద్ర, అప్పుల బాధతో గురువారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు తెలిపారు.