ఘనంగా స్వర్గీయ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

MBNR: స్వాతంత్ర సమరయోధులు, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, కార్మిక నేత స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్నకు ఘనంగా జయంతి నివాళులర్పించారు. బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో బీసీ సమాజ్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీ వర్గాల హక్కుల కొరకు పోరాడిన సాయుధ పోరాట యోధుడన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు పాల్గొన్నారు.