మిత్రుడి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం
WGL: అనారోగ్యంతో మరణించిన ఏఆర్ పీసీ-343 మారపల్లి బాబు కుటుంబానికి వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ 2007వ బ్యాచ్ సొసైటీ సభ్యులు అండగా నిలిచారు. 34 మంది సభ్యులున్న ఈ సొసైటీ తరఫున బాబు కుటుంబ సభ్యులకు రూ.1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొని ప్రగాఢ సానుభూతి తెలిపారు.