రామనారాయణంలో కూచిపూడి నృత్య ప్రదర్శన

VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో శనివారం సందర్బంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. హైదరాబాద్‌కు చెందిన S.L.V మ్యూజిక్ అకాడమీ సమక్షంలో విద్యార్థులు నిర్వహించిన కూచిపూడి నృత్యం ఆధ్యంతం ఆహుతులను ఆకర్షించింది.