VIDEO: 'దివ్యాంగులకు అన్యాయం చేయవద్దు'

సత్యసాయి: రొల్ల మండలం ఎంపీడీవో కార్యాలయం వద్ద బుధవారం దివ్యాంగులు ఆందోళన చేశారు. రీ వెరిఫికేషన్ పేరుతో అర్హులైన వారి పెన్షన్లు తొలగించడాన్ని వారు ఖండించారు. వైసీపీ మండల కన్వీనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన వారి హక్కులను కుదించడం అన్యాయం అని విమర్శించారు. ఎన్నికల ముందు పెన్షన్ పెంచుతామని చెప్పి, ఇప్పుడు తొలగించడం తప్పని పేర్కొన్నారు.