పొగమంచు బీభత్సం.. 12 వాహనాలు ఢీ!
గ్రేటర్ నోయిడాలో దట్టమైన పొగమంచు ప్రమాదాలకు కారణమైంది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో (Poor Visibility) వరుసగా 12 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ సీరియల్ యాక్సిడెంట్‌లో పలువురికి గాయాలు కాగా, వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఉదయం వేళల్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.