నేటి నుంచి సోయాబిన్ కొనుగోళ్లు...!
KMR: మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోయాబిన్ కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. గ్రామాల వారిగా షెడ్యూల్ ప్రకారం సోయా కొనుగోలు ప్రారంభమవుతుందని సొసైటీ అధికారులు తెలిపారు. నేటి నుంచి గురువారం వరకు మద్నూర్, వాడి ఫతేపూర్ గ్రామ శివారు రైతుల నుంచి మాత్రమే సోయా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు.