ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ జెడ్పిటీసీ

ముత్తుముల సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ జెడ్పిటీసీ

ప్రకాశం: రాచర్ల మండలం చిన్నగాని పల్లె గ్రామంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అశోక్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా రాచర్లకు చెందిన మాజీ జెడ్పిటీసీ కుప్పా రంగసాయి, వారి అనుచరులు టీడీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ కండువాలు కప్పి అశోక్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో అశోక్ రెడ్డి గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని రంగా సాయి తెలిపారు.