రెండు కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

రెండు కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

SRD : గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు డివిజన్‌లోని చైతన్య నగర్ కాలనీలో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మినీ ఫంక్షన్ హాల్‌కు శంకుస్థాపన చేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో వేడుకలు నిర్వహించుకునే సౌకర్యం కల్పించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.