డెమోక్రాట్ల హవా.. ట్రంప్ పాలనకు రెఫరెండమేనా..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. న్యూజెర్సీ, వర్జీనియా గవర్నర్లతో పాటు న్యూయార్క్ మేయర్‌గా డెమోక్రాట్ అభ్యర్థులు జయకేతనం ఎగరవేశారు. దీంతో 2026లో మిడ్‌టర్మ్ ఎన్నికలు జరగనున్న వేళ రిపబ్లికన్లకు ఈ ఫలితాలు సవాల్‌గా మారనున్నాయి. అలాగే, ఇటీవల నిర్వహించిన పోల్‌లో తాజా పరిణామాలపై ప్రతి 10 మందిలో ఆరుగురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తేలింది.