నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్

ఆదిలాబాద్: బాసర అమ్మవారి దర్శనానికి హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తుడు సోమవారం గోదావరి నదిలో స్నానం ఆచరించి హడావిడిలో ఆటోలోనే తన సెల్ ఫోన్‌ను మరచి రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. గమనించిన డ్రైవర్ చెన్నాగౌడ్ భక్తుడి వివరాలు తెలుసుకుని తిరిగి అప్పగించాడు. దీంతో ఆయనను పలువురు అభినందించారు. సదరు భక్తుడు అతనికి కృతజ్ఞతలు తెలిపాడు.