చాపరాయి జలపాతం పునఃప్రారంభం

చాపరాయి జలపాతం పునఃప్రారంభం

ASR: మూతపడిన డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి జలపాతాన్ని ఇవాళ పునఃప్రారంభించారు. తుఫాన్ వలన గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు గెడ్డలు తగ్గుముఖం పట్టడంతో చాపరాయిని పునఃప్రారంభించి సందర్శకులను అనుమతించారు.