న్యాయవాద రక్షణ చట్టంపై బార్ అసోసియేషన్ హర్షం
PDPL: న్యాయవాద రక్షణ చట్టాన్ని రాష్ట్ర కేబినెట్ ఆమోదించి ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుండడం పట్ల మంథని బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బార్ అసోసియేషన్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్గానికి కృతజ్ఞతలు తెలియజేశారు. న్యాయవాద రక్షణ చట్టం ప్రవేశపెట్టడంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.