BREAKING: ఖతార్ సంచలన ప్రకటన
ఖతార్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. యుద్ధం మరో రెండు రోజులు కొనసాగితే బ్యారెల్ ముడి చమురు ధర 150 డాలర్లకు చేరుతుందని హెచ్చరించింది. ప్రపంచ దేశాలకు పెనుసంక్షోభం పొంచి ఉందని అభిప్రాయపడింది. కాగా, పశ్చిమాసియా దేశాల యుద్ధం కారణంగా ముడి చమురు రవాణా నిలిచిపోయింది. దీంతో నిల్వలు తగ్గిపోయి పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.