వంతెనను ఢీకొట్టిన లారీ
కృష్ణా: ఇసుక లారీ వంతెనను ఢీకొట్టిన ఘటన గన్నవరంలో జరిగింది. వీరపనేనిగూడెం నుంచి పెద్ద అవుటపల్లి వైపు వస్తున్న ఇసుక లారీ అదుపుతప్పి పోలవరం కాలువపై ఉన్న వంతెనను బలంగా ఢీకొంది. ఆ సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో వంతెన దెబ్బతినడంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తుల సమాచారంతో సంబంధిత అధికారులు రహదారిని క్లియర్ చేసే పనులను ప్రారంభించారు.