'అమరవీరుల సంస్మరణ సభను విజయవంతం చేయాలి'
ADB: ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద ఈనెల 20న నిర్వహించనున్న మహపూజ, సంస్మరణ సభను విజయవంతం చేయాలని రగల్ జండా కమిటీ అధ్యక్షుడు మేస్రం నాగనాథ్ పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 9 తెగల ఆదివాసులు, రాజకీయ, మహిళా సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అమరవీరులకు నివాళులర్పించేందుకు అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలన్నారు.