రాట్నాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

రాట్నాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ELR: పెదవేగి మండలం రాట్నాలకుంటలో వెలసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు అన్నప్రాసన, నూతన వస్త్రాలంకరణ తదితర మొక్కుబడులను చెల్లించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.