నేడు నగరపాలక బడ్జెట్ సమావేశం

CTR: నగరపాలక కౌన్సిల్ వార్షిక బడ్జెట్, అత్యవసర సమావేశం గురువారం నిర్వహించనున్నట్లు మేయర్ అముద తెలిపారు. ఉదయం 11 గంటలకు నగరపాలక కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుందని వివరించారు. ఈ విషయాన్ని గమనించి, అధికారులు, నాయకులు, తదితరులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.