అర్జీలు స్వీకరించిన అధికారులు

ప్రకాశం: కొరిశపాడులోని తాసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సుబ్బారెడ్డి, ఎండీఓ రాజ్యలక్ష్మి లు పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించడం జరుగుతుందన్నారు.