VIDEO: పక్క గృహాలు మంజూరు చేయాలని నిరసన

VIDEO: పక్క గృహాలు మంజూరు చేయాలని నిరసన

ప్రకాశం: నక్కల గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కోరుతూ భారీ ధర్నా నిర్వహించారు. తమకు నిలువనీడ కల్పించాలని గిరిజనులు గళమెత్తారు. కలెక్టరేట్ ముఖద్వారం వద్ద మహిళలు, పురుషులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, నక్కల కులస్తుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని కోరారు.