'రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'
VZM: గజపతినగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల సభలో డీసీసీబీ ఛైర్మన్, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో 45,075 మంది రైతులకు 29.64 కోట్ల రూపాయలు నిధులు విడుదల అయ్యాయన్నారు.