శివ శ్రీనివాసరావును సత్కరించిన ఎమ్మెల్యే
EG: మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు (కె.కె)ని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కలిశారు. జనసేన 'నా సేన కోసం నా వంతు' రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మితో కలిసి ఆయన కె.కెని గజమాలతో ఘనంగా సత్కరించారు.