ఈవీఎం గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంది: కలెక్టర్

ఈవీఎం గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంది: కలెక్టర్

WNP: జిల్లా కేంద్రంలోని ఈవీఎంలు భద్రపరచిన గోదాము కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం వనపర్తి ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.