డ్రైనేజీలో పడి గ్రామ పంచాయతీ వర్కర్ మృతి

WNP: వనపర్తి మండలంలోని అంకూరు గ్రామంలో శనివారం మురికి కాలువ శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి ఓ గ్రామ పంచాయతీ వర్కర్ మృతి చెందాడు. రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం.. అంకూరు గ్రామానికి చెందిన కొమ్ము రాములు (45) రైతు వేదిక ముందు డ్రైనేజీని శుభ్రం చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.