TDP కార్యాలయానికి ప్రభుత్వం భూమి కేటాయింపు
TPT: తిరుపతి జిల్లా అవిలాలలో రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ కార్యాలయం కోసం ప్రభుత్వం భూమి కేటాయించింది. 2 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎకరాకు ఏడాదికి రూ.1,000 చొప్పున 33 ఏళ్ల లీజుకు ఇస్తున్నట్టు వివరించారు. కాగా త్వరలోనే టీడీపీ కార్యాలయం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.