విగ్రహ ప్రతిష్ఠాపన పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల

విగ్రహ ప్రతిష్ఠాపన  పాల్గొన్న ఎమ్మెల్యే వర్ల

కృష్ణా: గ్రామాల్లో ప్రజలు నిర్వహించుకునే పండుగ వాతావరణంలో తాను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా అన్నారు. శుక్రవారం మొవ్వ మండలం వేములమడలో శ్రీ రేణుక అంకమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ వేడుకలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. గ్రామస్థులను ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు.