కాజీపేటకు రైల్వే జోన్ ఇవ్వాల్సిందే: ఎంపీ కావ్య

కాజీపేటకు రైల్వే జోన్ ఇవ్వాల్సిందే: ఎంపీ కావ్య

తెలంగాణ రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య లోక్‌సభలో గళమెత్తారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌ను తక్షణమే ప్రారంభించాలని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పరిపాలనా సౌలభ్యం కోసం కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే జోన్ లేదా సబ్ జోన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.