VIDEO: 'నీటిని ఆలస్యంగా ఎందుకు విడుదల చేశారు'

VZM: తోటపల్లి నీటిని ఆలస్యంగా ఎందుకు విడుదల చేశారని జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధికారులను ప్రశ్నించారు. జిల్లా DRC సమావేశంలో శ్రీనివాసరావు ఇవాళ మాట్లాడుతూ.. ఆలస్యంగా నీటిని విడుదల చేయడం వల్ల శివారు భూములకు సాగునీరు అందలేదన్నారు. మంత్రి అనిత స్పందిస్తూ రైతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.