గుడివాడలో టిడ్కో స్పెషల్ గ్రీవెన్స్‌డే
కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో టిడ్కో స్పెషల్ గ్రీవెన్స్‌డేను ఇవాళ నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ డేలో 102 లబ్ధిదారులు అర్జీలను సమర్పించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్ స్వయంగా అర్జీలను పరిశీలించి, పరిష్కార మార్గాలను అధికారులకు ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా ప్లాట్స్ ఇవ్వని వారికి అందజేస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.