మంత్రి చేతుల మీదుగా 2K రన్ పోస్టర్ ఆవిష్కరణ
ప్రకాశం: మార్కాపురం నూతన జిల్లా ప్రకటించిన సందర్భంగా మార్కాపురం యూత్ ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించనున్నారు. పట్టణంలోని సెవెన్ హిల్స్ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు తలపెట్టిన ఉదయం 7 గంటలకు 2K రన్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిలు ఆవిష్కరించారు.